ఈ వారం బిగ్ బాస్ 3 నామినేషన్ లో ఉన్న మహేష్, రాహుల్ తో పాటు హిమజ కూడా చేరింది. బిగ్ బాస్ కెప్టెన్ అయిన వితిక కు సేఫ్ అయిన కంటెస్టెంట్లు లో ఒకరిని డైరెక్ట్ గా నామినేట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. దాంతో వితిక హిమిజా ను డైరెక్ట్ గా నామినేట్ చేసింది. కారణం తన భర్త అయిన వరుణ్ హిమజ కోసం ఆ త్యాగం చేయడమే వితికకి నచ్చలేదు. అందుకే నామినేట్ చేసింది. మొత్తానికి నామినేషన్ కి వెళ్లిన హిమజ ఈసారి కచ్చితంగా ఎలిమినేట్ అవడం ఖాయంగా కనిపిస్తోంది. నామినేషన్ లో రాహుల్ స్ట్రాంగ్ గా ఉంటె మహేష్ కన్నా లీస్ట్ ఓటింగ్స్ తో హిమజ ఉండడం విశేషం.