కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన బండ్ల గణేష్ తర్వాత నిర్మాత అవతరమెత్తి... బడా హీరోలతో సినిమాలు నిర్మించాడు. తర్వాత సినిమాలు పక్కనబెట్టి మరీ రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ రాజకీయ అనుభవం లేని బండ్ల గణేష్ మల్లి సినిమాలనే నమ్ముకున్నాడు. ఇప్పటికే మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాతో కమెడియన్ రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు...ఆ సినిమాలో తన పార్ట్ షూటింగ్ ని కూడా పూర్తి చేసుకున్నాడు. తాజాగా నాని సినిమాతో నిర్మాతగా కూడా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ఒకప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాలు నిర్మించిన బండ్ల గణేష్ ఇప్పుడు సేఫ్ సైడ్ గా నిర్మాతల పాలిట దేవుడైన హీరో నాని తో సినిమాని చేయబోతున్నట్లుగా సమాచారం.