సొట్టబుగ్గలతో కుర్రకారు మతి పోగొట్టిన బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే స్టార్ హీరో రణవీర్ సింగ్ ను వివాహం చేసుకున్న తర్వాత స్పీడు పెరిగిందనే చెప్పాలి. ఫంక్షన్ ఏదైనా దీపిక తన తళుకులతో మెరిసి చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. తాజాగా ఐఫా అవార్డుల ఫంక్షన్ లో ఇలా దేవకన్యలా కనిపించింది. ప్రతి ఫంక్షన్ కు పోటీపడి ముస్తాబవుతూ అందానికే అసూయపుట్టేంత అందంగా తయారవుతుంది. ఐఫా గ్రీన్ కార్పేట్ పై దీపికా పదుకునే హోయలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆమె అందానికి ప్రముఖ డిజైనర్లు సైతం ఫిదా అయిపోయారు. ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా కౌచర్ డిజైన్ చేసిన వయోలెట్ కలర్ ఔట్ ఫిట్ లో దీపిక గ్రీన్ కార్పెట్ పై మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రణవీర్ సరసన `83` చిత్రంలో నటిస్తున్న దీపిక.. మేఘనా గుల్జార్ రూపొందిస్తున్న `చపాక్` చిత్రంలోనూ నటిస్తోంది.