ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భానుప్రియ అరెస్టుకు రంగం సిద్ధం?

cinema |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2019, 12:49 AM



అలనాటి హీరోయిన్ భానుప్రియను బాల కార్మిక నేరం క్రింద‌ అరెస్టు చేసే అవకాశం ఉందని స‌మాచారం ఇందుకు సంబంధించిన వివ‌రాల‌లోకి వెళితే  చెన్నైలో భానుప్రియ తన ఇంటి పని కోసం మైనర్‌ బాలికలను నియమించుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నది. పనిపిల్ల తన ఇంట్లో చోరీకి పాల్పడిందని జనవరి 19న పాండిబజార్‌ పోలీస్‌స్టేషన్‌లో భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్‌ ఫిర్యాదు చేశారు. 

అయితే పనిపిల్ల తల్లి ప్రభావతి రివర్స్ కేసు పెట్టింది. సామర్లకోట పోలీసులకు నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపీకృష్ణన్లపై ఫిర్యాదు చేసింది. తన కూతుర్ని ఇంట్లో నిర్బంధించి చిత్రవధకు గురి చేశారని, రక్షించమని చేసిన ఫిర్యాదు మేరకు సామర్లకోట పోలీసులు చెన్నైకి వచ్చి నటి భానుప్రియను విచారించారు.  
అప్ప‌ట్లో భానుప్రియ పెట్టిన కేసులో పనిపిల్ల, తల్లి ప్రభావతిని అరెస్ట్‌ చేసిన  చెన్నై, పాండిబజార్‌ పోలీసులు  విచారించారు. తాజాగా సామర్లకోట పోలీసులు నటి భానుప్రియ కేసులో రం జరిగింది చెన్నైలో క‌నుక‌ నటి భానుప్రియపై బాల కార్మిక చట్టం కింద సామర్లకోట పోలీసులు నమోదు చేసి, కేసును చెన్నై పోలీసులకు అప్పగించారు. దీంతో చెన్నై, పాండిబజార్‌ పోలీసులు ఆ కేసుకు సంబంధించి నటి భానుప్రియ, ఆమె సోదరుడు గోపాలకృష్ణన్‌పై కేసును విచార‌ణ ఆరంభించారు.  దీంతో పోలీసులు ఏ క్షణంలోనైనా భానుప్రియను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందంటూ వ‌స్తున్న వార్త‌లు ఇండ్ర‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. 





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com