ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎఫ్ హెచ్ఎం ఇండియా మేగజైన్ కవర్ పేజ్ పైన కైరా అద్వానీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 24, 2017, 12:59 PM



అందాల భామలు.. ముఖ్యంగా అప్ కమింగ్ భామలు అవకాశాలు అందుకోవాలంటే.. అత్యంత అనువైన మార్గం ఫోటో షూట్స్. వీటిలో ఎంత హాట్ గా కనిపిస్తే అంతగా వీరికి ఛాన్సులు ఇచ్చేందుకు.. ఫిలిం మేకర్స్ ముందుకొస్తారు. మరోవైపు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ చేసుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు కూడా ఉత్సాహం చూపిస్తాయి.


ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ చిత్రంలో.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి జోడీగా ధోనీ భార్య సాక్షి పాత్రలో నటించిన సుందరి కైరా అద్వానీ. ఆ తర్వాత మెషీన్ అనే హిందీమూవీలో లీడ్ రోల్ చేసింది కానీ.. ఆ చిత్రం సక్సెస్ తీరాలను చేరలేకపోయింది. అయినా సరే అమ్మడికి టాలీవుడ్ నుంచి ఓ భారీ అఫర్ అందేసింది. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అను నేను చిత్రంలో హీరోయిన్ పాత్రలో కనిపించనున్న కైరా అద్వానీ.. ఇప్పుడు ఎఫ్ హెచ్ఎం ఇండియా మేగజైన్ కవర్ పేజ్ పైకి ఎక్కేసింది. టోన్డ్.. సెక్సీ అండ్ స్ట్రాంగ్ అంటూ డిస్క్రిప్షన్ ఇచ్చి.. ది ఫ్రంట్ రన్నర్ అంటూ ట్యాగ్ లైన్ తగిలించి మరీ ఈ సుందరి ఇచ్చిన సెక్సీ పోజులను ప్రచురించారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com