చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ కు మంచి క్రేజ్ ఉంది. ఒకసారి ఆ కాంబినేషన్ తో వచ్చిన సినిమా హిట్టయ్యాక మళ్లీ వాళ్లు జంటగా ఎప్పుడు సినిమా చేస్తారా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. టాలీవుడ్ లో అలాంటి కాంబినేషన్ నాగ్ – అనుష్క. నాగ్ యాక్ట్ చేసిన సూపర్ తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అనుష్క. ఆ తర్వాత ఈ గ్రీకువీరుడితో కలిసి డమరుకం, ఓం నమో వేంకటేశాయ సినిమాల్లో నటించింది . అలాగే నాగ్ నటించిన సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి సినిమాల్లో కామియో రోల్స్ వేసింది. అయితే ఇప్పుడు వర్మ .. నాగ్ తో తెరకెక్కించనున్న మూవీలో అనుష్కనే కథానాయికగా సెలక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. భాగమతి చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసిన ఈ అమ్మడు ప్రస్తుతం ఖాళీగా ఉంది. అందుకోసం వర్మ మూవీలో నటించేందుకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరి దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రావలసి ఉంది.