ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాను చేసిన పనికి అమితాబ్ క్షమాపణలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2019, 09:43 PM



బాబాసాహెబ్‌పాల్కే అవార్డ్ గ్రహీత అమితాబాద్ క్షమాపణలు కోరారు. తాను చేసిన పని, తనకు బాధగానే ఉన్నా… తప్పలేదని ట్వీట్టర్ వేదికగా అభిమానులను పలకరించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న బిగ్‌బీ, ఇటీవలే ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నారు.
ఇంతకీ, బిగ్‌ బీ ఎందుకు క్షమాపణలు చెప్పారంటే… ప్రతి ఆదివారం తనను కలిసేందుకు అభిమానులు తన ఇంటి ముందు గుంపులు గుంపులుగా ఉంటారు. ప్రతి ఆదివారం ఉదయం అభిమానుల కోసం బయటకు వచ్చి… అభివాదం చేయటం బిగ్‌బీకి అలవాటు. ఆయన అభిమానులు కూడా ఆదివారం వచ్చిందంటే అక్కడకు వెళ్తుంటారు. కానీ ప్రతి వారం వచ్చినట్లు ఈ ఆదివారం బిగ్‌బీ బయటకు రాలేదు. ఆయన బయటకు రాలేకపోతున్నారని కూడా ఎవరూ సమాచారం అందివ్వలేదు. దీంతో.. అభిమానులు కాస్త నిరాశపడి, వెళ్లిపోయారు. దీనిపై స్పందించిన బిగ్‌బీ తన ఆరోగ్యం బాగా లేదని, అందుకే రెస్ట్‌ తీసుకుంటున్నందు వల్ల బయటకు రాలేకపోయానని వివరణ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com