‘సినిమా బాలేదని చెప్పడానికి మీరు ఎవరు? మీరు పెద్ద తోపులు అనుకుంటున్నారా? సినిమా బాగుంది బాగాలేదని చెప్పడానికి మీ అంత మూర్ఖులు ఎవరూ ఉండరు. మీరంతా కోన్ కిస్కా గొట్టంగాళ్లు’ అని క్రిటిక్స్ మీద నటుడు ఆలీ విరుచుకుపడ్డారు. సోమవారం ఈ సినిమా సక్సెస్ మీట్ కి వచ్చేసిన ఆలీ
ఈ సినిమాకు యూనిట్ అంతా పడ్డ కష్టం మాకు తెలుసు. ఆ కష్టం తెరమీద ప్రేక్షకుడు పూర్తిగా చూడక ముందే మీఒక్క మాటతో సినిమాలను ఎప్పుడూ కించపరచకండి అన్నారు. సినిమాపై ఒక రాయి వేసేస్తే మేం తోపులం అని ఫీల్ అవుతున్నారంటూ మండి పడ్డారు.
ఇటీవల విడుదలైన ‘రాజుగారి గది 3’ లో అలీ హీరో స్నేహితుడిగా నటించిన విషయం విదితమే.