ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రివ్యూ రైటర్లపై అలీ సంచలన వ్యాఖ్యలు

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2019, 08:04 PM



ఏదైనా మనకు మంచిగా చెప్పినపుడు అబ్బో మీరు తోపు అంటారు.. ఒక్కసారి రివర్స్ అయిందా సీన్ కూడా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో ఇదే జ‌రుగుతుంది. రివ్యూ రైటర్లపై చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో వివక్ష నడుస్తుంది. ఎప్పుడు ఛాన్స్ దొరికినా కూడా రివ్యూవర్లను విమర్శించడానికి సిద్ధంగానే ఉన్నారు సెలెబ్రిటీస్. ఇప్పుడు కమెడియన్ అలీ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన కూడా ఇప్పుడు రివ్యూ రైటర్లపై ఇష్టమొచ్చినట్లు కమెంట్స్ చేసాడు. వాళ్ల కోసం కాదు మేం సినిమాలు తీసేది.. వాళ్లెవరు డిసైడ్ చేయడానికి గొట్టం గాళ్లు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇదే ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఈయన నటించిన రాజుగారిగది 3 సినిమా ఈ మధ్యే విడుదలైంది. దీనికి నెగిటివ్ టాక్ వచ్చింది. రొటీన్ కథ అంటూ రాజుగారిగది 3పై రివ్యూ రైటర్స్ కూడా విమర్శల వర్షం కురిపించారు. ఇదే ఇప్పుడు అలీకి నచ్చట్లేదు. ఓ చిన్న సినిమా విడుద‌లైన‌పుడు అది బాగుంద‌ని రాస్తే.. రివ్యూ రైట‌ర్లు గొప్పోళ్లు అయిపోతారు. మా సినిమాకు ఇంత రేటింగ్ వ‌చ్చిందని.. ఇచ్చార‌ని గొప్ప‌గా వాళ్లే పోస్ట‌ర్ల‌పై వేసుకుంటారు. కానీ అదే రివ్యూ రైట‌ర్ సినిమాకు త‌క్కువ రేటింగ్ ఇస్తే మాత్రం వాళ్ల‌కు సినిమా చూడ‌టం రాదు.. వాళ్ల కోసం కాదు మేం సినిమాలు తీసింది అంటూ ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడ‌తారు.. విమ‌ర్శిస్తుంటారు ఇదెక్కడి న్యాయం అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ రివ్యూ నిజంగా అంత ప్రభావం చూపిస్తే.. అప్పుడు వాళ్లిచ్చిన రేటింగ్స్ కూడా పోస్టర్స్‌పై వేసుకోకూడదు కదా.. మా సినిమా జనాల కోసం తీసామని చెప్పుకోవచ్చు కదా అంటూ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. తాజాగా అలీ చేసిన కమెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో కొంతమంది పని గట్టుకొని మరీ సినిమాను విమర్శిస్తున్నారని.. బాగున్న సినిమాలను కూడా బాగోలేదని రాస్తున్నారని అలీ తీవ్ర అసహనం వ్యక్తం చేసాడు. అసలు వాళ్లెవరు చెప్పడానికి గొట్టంగాళ్లు.. మేం సినిమాలు తీసేది ప్రేక్షకుల కోసం కదా.. వాళ్లు చూసి డిసైడ్ చేయాలి కదా అంటున్నాడు అలీ. రివ్యూవర్లను నమ్ముకుని తామేం ఇండస్ట్రీకి రాలేదని.. ప్రేక్షకులను నమ్ముకుని వచ్చామని.. వాళ్లే తమను ఈ స్థాయికి తీసుకొచ్చారని చెప్పాడు. వాళ్లు సినిమా చూసి సరైన తీర్పు చెబుతారని.. మధ్యలో రివ్యూ రైటర్స్ ఎక్స్ ట్రాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు. తనకు రివ్యూల మీద మంచి అభిప్రాయం లేకపోవడం వల్లే ప్రెస్ షోలు చూడట్లేదని చెప్పాడు అలీ. ఏదేమైనా కూడా రివ్యూ రైటర్లపై ఇప్పుడు అలీ చేసిన కమెంట్స్ సంచలనం రేపుతున్నాయి. సినిమా బాగుందని ఇచ్చినపుడు ఇదే రివ్యూవర్లను నెత్తిన పెట్టుకునే వాళ్లు.. బాగోలేదని చెప్పినపుడు మాత్రం నేలకేసి కొట్టడం సరైన పద్దతి కాదంటున్నారు విశ్లేషకులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com