ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖేల్ ప్లే ర‌మ్మి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కాజ‌ల్ అగ‌ర్వాల్

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2019, 10:09 PM



ఆన్ లైన్ గేమింగ్ ప్లాట్ ఫామ్ ఖేల్ ప్లే ర‌మ్మి గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆన్ లైన్ గేమింగ్ లోనే విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు తీసుకొచ్చింది. తాజాగా ఖేల్ ప్లే రమ్మి సంస్థ తో స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ తో చేతులు క‌లిపింది. ఇక‌పై ఖేల్ ప్లే రమ్మికి కాజ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ప్ర‌మోట్ చేయ‌నుంది. కాజ‌ల్ ఎంట్రీతో ఖేల్ ప్లై సంస్థ‌కే మార్కెట్లో ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కింది.


ఈ సంద‌ర్భంగా హెడ్ ఆఫ్ మార్కెటింగ్ ఖేల్ గ్రూప్ కు చెందిన శ్రీ చైత‌న్య స‌లుంకే మాట్లాడుతూ, ` కాజ‌ల్ ని మా సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉంది. మా బ్రాండ్ ప‌ట్ల మార్కెట్లో మ‌రింత అవ‌హ‌గాహ‌న పెరుగుతుంది. గేమ్ అభివృద్దికి ఆమె ఎంతో తోడ్ప‌డుతున్నారు. గేమ్ ప‌ట్ల అభిరుచిగ ల వారంతా మ‌రింత అనుబంధం ఏర్ప‌రుచుకుంటారు. ఈ గేమ్ నైపుణ్య‌త‌తో పాటు, వినోదం, థ్రిల్ ని అందిస్తుంది. ర‌మ్మి భార‌త‌దేశంలోనే నెంబ‌ర్ స్థానంలో కొన‌సాగుతుంది. కాజ‌ల్ ర‌మ్మి ప‌ట్ల మంచి ఉత్సాహాన్ని చూపిస్తారు. ఆమె ఎంట్రీతో గేమ్ మ‌రింత ముందుకు వెళ్తుంద‌ని ఆశిస్తున్నాం` అన్నారు.


బ్రాండ్ అంబాసిడ‌ర్ కాజ‌ల్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ, ` ర‌మ్మి ఆట‌ను అంద‌రిలాగే నేను బాగా ఇష్ట‌ప‌డ‌తాను. ఖాళీ స‌మ‌యంలో ర‌మ్మి ఆడుతుంటాను. ఇప్పుడు ఈ గేమ్ లోనేను భాగం కావ‌డం సంతోషంగా ఉంది. ఈ గేమ్ ఆన్ లైన్ లో మంచి స్థానంలో ఉంది. కేపీఆర్ ప్ర‌ధాన ల‌క్ష్యం. ర‌మ్మిని వ‌ర‌ల్డ్ వైడ్ చేయ‌డం. ఇండియాలోనే నెంబ‌ర్ స్థానంలో ఉంది. రానున్న రోజుల్లో, ఈ డిజిట‌ల్ యుగంలో ర‌మ్మికి మ‌రింత ఆద‌ర‌ణ ద‌క్కుతుండ‌న‌డంలో సందేహం లేదు అని అన్నారు.


డిజిట‌ల్ ప్లాట్ ఫాం ద్వారా కేపీఆర్ న‌వ‌త‌రాన్ని మ‌రింత ప్రోత్స‌హిస్తుంది. 2023 నాటికి భార‌తదేశ‌పు ఆన్ లైన్ గేమింగ్ ప‌రిశ్ర‌మ 11900 కోట్ల రూపాయ‌ల ఆదాయం ఆర్జించ‌నుంద‌ని అంచ‌నా. ప్ర‌స్తుతం 22 శాతం సీజీ ఏఆర్ ను ఇది న‌మోదు చేస్తుంద‌ని కేపీఎంజీ నివేదిక ద్వారా తెలుస్తోంది. దీన్ని మ‌రింత వృద్ది చేస్తూ, ఖేల్ ప్లే ర‌మ్మి లో 30 ల‌క్ష‌ల విన‌యోగ‌దారులు డేటా బేస్ గా ఉంది. త‌మ ప్లేయ‌ర్ల‌తో అనుసంధానిం చ‌డంతో పాటు, 10,13,21 మ‌రియు 27 కార్డుల ర‌మ్మి అయిన‌టి వంటి పుల్, పాయింట్స్ డీల్ అవ‌కాశాన్ని క‌ల్పిస్తుంది. 


ఖేల్ ప్లే ర‌మ్మి ప్లాట్ ఫాం వేదిక వెనుక ఉన్న ఆలోచ‌న క‌స్ట‌మైజేష‌న్. దీనిలో భాగంగా స్మార్ట్ ఫోన్లు, కంపూట‌ర్లు ఉన్న వారిపైనే దృష్టి పెట్టింద‌ని తెలిపారు. శ్రీ సులంకే ఇంకా మాట్లాడుతూ, ` అనుసంధానిత‌, భాత్య‌త‌యుతమైన గేమింగ్ అనేవి ఆన్ లైన్ ర‌మ్మి స్పేస్ లో కీల‌క‌మైన తోట్పాడుదారుల‌. కేపీఆర్ ఈ రెండు అంశాల్లోనూ , సుర‌క్షిత పేమెంట్ గెట్ వేల‌తో విప్ల‌వాత్మ‌క‌మైన ఆఫ‌ర్లు మ‌రియు టోర్న‌మెంట్ల‌ను అందిస్తుంది. భారీ ఎత్తున జ‌రిగే టోర్న మెంట్లల‌లో భాగంగా ఇత‌ర ఆట‌గాళ్ల‌తో క‌నెక్ట్ అయ్యే అవ‌కాశం క‌ల్పిస్తుంది` అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com