‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’ వంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన దర్శకుడు దర్శకుడు కొండా విజయ్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా ‘ఒరేయ్ బుజ్జిగా’ సెట్లో కొండా విజయ్‌కుమార్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. యూనిట్ సభ్యుల నడుమ కేక్ కట్ చేశారు కొండా. హీరో రాజ్‌తరుణ్, నిర్మాత కె.కె.రాధామోహన్, హీరోయిన్ మాళవిక నాయర్, నటి వాణీ విశ్వనాథ్, నటులు సత్యం రాజేష్, మధునందన్, సినిమాటోగ్రాఫర్ ఆండ్రూలతోపాటు యూనిట్ సభ్యులంతా కొండా విజయ్‌కుమార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.