తమిళ నవల వెక్కై ఆధారంగా శివసామి పాత్రలో హీరో ధనుష్ నటించిన తమిళ చిత్రం అసురన్ ప్రేక్షకులు మరియు విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. ధనుష్-వెట్రిమారన్ ల జోడీలో నాల్గో సినిమాగా వచ్చిన ఈ అసురాన్ తమిళ బాక్సాఫీస్‌ను బద్దలయ్యేలా బ్లాక్ బస్టర్ హిట్ గా మారింది.
మంజు వారియర్, కెన్ కరునాస్, పసుపతి, అమ్మూ అభిరామి, బాలాజీ శక్తివేల్, ప్రకాష్ రాజ్, ఆదుకం నరేన్ మరియు సుబ్రమణ్యం శివ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించిన ఈ సినిమా చూసిన బాలీవుడ్ చిత్రనిర్మాత జోహార్ నటీనటులపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని 'సినిమా ఎట్ ఇట్స్ బెస్ట్స అంటూ సినిమా చాలా బాగుందని ట్వీట్ చేశారు.