సినీ నటుడు రాజశేఖర్ కారు బోల్తా పడింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో పెద్ద గొల్కొండ వద్ద శంశాబాద్ ఔటర్ రింగ రోడ్డుపై కారు బోల్తా కొట్టింది. వేగంగా వస్తున్న కారు టైర్ పగిలి పోవడంతో డివైడర్ ను ఢీకొట్టి ఫల్టీ కొట్టింది. ఈ ఘటనలో రాజశేఖర్ తో పాటూ డ్రైవర్ కి కుడా తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ఈ ప్రమాదం తెల్లవారు జామున 3:00 సమయంలో చోటుచేసుకుంది. అత్యాధునికమైన కారు కావడంతో పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్స్ వెంటనే తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్టయింది.