ట్రెండింగ్
Epaper    English    தமிழ்

300 కోట్ల క్లబ్‌లో చేరిన విజయ్ "విజిల్"....

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 07:57 PM



తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిన బిగిల్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తెలుగులో ఈ సినిమాను విజిల్ పేరుతో రిలీజ్ చేశారు. తొలి రోజే సక్సెస్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విజయవంతంగా 17 రోజుల రన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డ్ సృష్టించింది. దీంతో విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ 17 రోజుల్లో బిగిల్ (విజిల్) సాధించిన కలెక్షన్స్‌పై ఓ లుక్కేద్దామా..


ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 25వ తేదీన మొదలైన బిగిల్ హంగామా నేటికీ కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన విజయ్ ఆడియన్స్ చేత భేష్ అనిపించుకుంటున్నాడు. విడుదలైన అన్నిసెంటర్లలో జోష్ కొనసాగిస్తూ తాజాగా 300 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది విజిల్. దేశవ్యాప్తంగా బిగిల్ వసూళ్లు చూసినట్లయితే.. మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి 188 కోట్ల మేర గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో 19 కోట్లు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 19.38 కోట్లు, తమిళనాడులో 130 కోట్లు, కేరళలో 15.76 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.72 కోట్లు రాబట్టింది బిగిల్ (విజిల్) మూవీ. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదలైన బిగిల్ మూవీ రెండు భాషల్లోనూ అంచనాలను అందుకొని దూసుకుపోతోంది. తమిళ వర్షన్‌లో ఇప్పటిదాకా 144.06 కోట్ల నెట్ వసూళ్లు నమోదు చేసిన ఈ సినిమా తెలుగు వర్షన్‌లో 15.94 కోట్లు రాబట్టింది. మొత్తంగా 160 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి. సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో బిగిల్ బిజినెస్ చెప్పుకోదగినదిగా ఉంది. తమిళనాడులో 85 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఇప్పటికి 77 కోట్లు వచ్చేశాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లకు గాను 11.20 కోట్లు, కర్ణాటకలో 12 కోట్లకు గాను 11.20 కోట్లు, కేరళలో 3 కోట్లకు గాను 8.10 కోట్లు, అలాగే ఓవర్సీస్‌లో 30 కోట్లకు గాను 37 కోట్లు రాబట్టింది బిగిల్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com