అఖల్ హీరోగా తెరకెక్కిన 'హలో' మూవీ ఆడియో వేడుక వైజాగ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో అదిరిపోయే డాన్స్ చేసిన అఖిల్.... ఆ తర్వాత మైక్ అందుకుని ఎమోషనల్‌గా మాట్లాడారు. 'గడిచిన సంవత్సర కాలం నా జర్నీ ఎంతో ఎమోషనల్‌గా సాగింది. మాటల్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ ఈ రోజు ఇలా ఇంత కాన్ఫిడెంట్‌గా నిలుచున్నాను అంటే కారణం మా అమ్మా నాన్న' అని అఖిల్ వ్యాఖ్యానించారు.‘అమ్మా, నాన్న నా లైఫ్ లో లేకుంటే ఏం జరిగేదో నాకు తెలియదు. నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. నేను కేవలం థాంక్స్ తో సరిపెట్టను.... వారు గర్వపడేలా చేస్తాను.' అని అఖిల్ భావోద్వేగానికి గురయ్యాడు."డైరెక్టర్ విక్రమ్ నన్ను కలిసినపుడు నేను నటన పరంగా చాలా తక్కువగా ఉన్నాను. ఎనర్జీ లెవల్స్‌తో పాటు కాన్ఫిడెన్స్ లెవల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. హలో సినిమా ద్వారా నేను అన్ని విషయాల్లో చాలా ఇంప్రూవ్ అయ్యాను. నీకు నేను కేవలం థాంక్స్ తో సరిపెట్టను. నాకు నువ్వు అన్నయ్య లాంటి వాడివి." అని అఖల్ అన్నారు.డాన్స్ చేసి అదరగొట్టిన అఖిల్ హలో ఆడియో వేడుకలో అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్ తమ డాన్స్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.ఈ వేడుక చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అక్కినేని అమల తెలిపారు. అనూప్ రూబెన్స్ గారు ఎంతో అద్భుతమైన సంగీతం అందించారని తెలిపారు. సినిమాటోగ్రాఫర్ వినోద్ గారు తన కెమెరాతో మ్యాజిక్ చేశారు. ప్రతి ఫ్రేము ఎంతో బాగా చూపించారు. కళ్యాణికి అద్భుతమైన భవిష్యత్ ఉంటుంది. విక్రమ్‌కి ఇదొక గ్రేట్ సక్సెస్‌గా నిలుస్తుంది. అక్కినేని అభిమానులతో పాటు నేను కూడా డిసెంబర్ 22 కోసం వెయిట్ చేస్తున్నాను అని అమల తెలిపారు.