ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహేష్ కొత్త లుక్ అదిరిందిగా..

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2017, 11:23 AM



టాలీవుడ్లోనే కాదు.. ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒకడు మహేష్ బాబు. అతడి పేరెత్తితే.. బాలీవుడ్ భామలు సైతం మెలికలు తిరిగిపోతుంటారు. ఈ మధ్యే ‘స్పైడర్’ సినిమాతో తమిళంలోకి వెళ్లిన మహేష్ ను చూసి అక్కడి వాళ్లు కూడా వావ్ అన్నారు. ‘స్పైడర్’ ఆడియో వేడుకలో యాంకర్లు.. నటీనటులు.. సాంకేతిక నిపుణులు మహేష్ అందం గురించి ఎలా పొగిడేశారో తెలిసిందే. బాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తగ్గని అందంతో ఉంటాడు కాబట్టే అతను నటించిన థమ్సప్ ప్రకటనను దేశవ్యాప్తంగా ప్రచారానికి ఉపయోగించకుంది ఆ సంస్థ. ఇప్పుడు మరోసారి మహేష్ బాబుతో నేషనల్ లెవెల్లో ప్రమోషన్ కోసం ఒక యాడ్ తీర్చిదిద్దుతోంది థమ్సప్ సంస్థ. ఈ ప్రకటనలో బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కూడా నటించడం విశేషం. వీళ్లిద్దరి మీదా కాలిఫోర్నియాలో భారీ ఎత్తున ఈ ప్రకటన చిత్రీకరించడం విశేషం.


‘భరత్ అను నేను’ షూటింగ్ నుంచి చిన్న విరామం తీసుకుని వెళ్లి ఈ ప్రకటనలో నటించి వచ్చాడు మహేష్. ఈ సందర్భంగా మహేష్ బాబు.. రణ్వీర్ తో కలిసి ఉన్న ఆన్ లొకేషన్ పిక్ ఒకటి బయటికి వచ్చింది. అందులో మహేష్ లుక్ చూసి వావ్ అంటున్నారు అతడి ఫ్యాన్స్. ఈ మధ్య కాలంలో మహేష్ బెస్ట్ లుక్ ఇదే అనిపించేలా చాలా స్మార్ట్ గా ఉన్నాడు ప్రిన్స్ అందులో. అతను కొంచెం సన్నబడ్డట్లు కూడా కనిపిస్తున్నాడు. బహుశా ఇదే లుక్ ‘భరత్ అను నేను’లోనూ ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ డిసెంబరు 31న విడుదల కానున్న సంగతి తెలిసిందే. మరి అందులో మహేష్ ఎలా ఉంటాడో చూద్దాం. ఈ చిత్రం ఏప్రిల్ నెలాఖర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com