ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రణవీర్‌సింగ్ పక్కన ఉంటె ప్రపంచం ను మర్చిపోతా

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 11, 2017, 11:45 AM



రణవీర్‌సింగ్, దీపికాపదుకునే ప్రేమాయణం గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ జంట ఇంతవరకు తమ అనుబంధం గురించి ఎక్కడా బాహాటంగా స్పందించలేదు. తాజాగా ఓ ఆంగ్ల మాస పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రణవీర్‌సింగ్‌తో తన ప్రేమ గురించి అనేక ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది దీపికాపదుకునే. తమ ఇద్దరి ప్రేమానుబంధాన్ని మాటల్లో వర్ణింప సాధ్యంకాదని, రణవీర్‌సింగ్ సాంగత్యంలో తాను ప్రపంచాన్నే మరచిపోతానని చెప్పింది. మేమిద్దరం కలిసినప్పుడు ఇక ప్రపంచంలో ఎవరూ అవసరం లేదనిపిస్తుంది. మా మధ్య జరిగే సంభాషణలు చాలా ప్రత్యేకంగా వుంటాయి. చక్కటి ఛలోక్తులు, వ్యంగ్యంతో కూడిన జోక్స్ చెప్పుకుంటాం. ప్రపంచ సినిమాల గురించి చర్చించుకుంటాం. ఒక్కోసారి మేథస్సుకు పదునుపెట్టే ఇంటెలిజెంట్ టాపిక్స్ కూడా మా మధ్యకు వస్తాయి. ఏమీ లేనప్పుడు మా ఇద్దరి మౌనం కూడా ఎన్నో భావాల్ని వ్యక్తం చేస్తుంది అని చెప్పుకొచ్చింది. మరి పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారని అడగ్గా..ప్రేమ అనేది సహజంగా తన గమ్యం వైపుకు పయనించాలి. పెళ్లి విషయంలో ముందస్తుగా తీసుకునే నిర్ణయాలు అర్థంలేనివి. కాబట్టి వివాహ విషయాన్ని కాలానికే వదిలేశాను అంటూ వేదాంత ధోరణిలో స్పందించింది. దీపికాపదుకునే కథానాయికగా నటించిన పద్మావతి చిత్రం వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 1న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదాపడింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com