హైదరాబాద్ : వర్థమాన కమెడియన్ విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. యూసుఫ్‌గూడలోని తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బొమ్మరిల్లు, అమ్మాయిలు అబ్బాయిలు చిత్రాలతో పాటు పలు సినిమాల్లో విజయ్ నటించారు. విజయ్ మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గత కొంతకాలంగా సినిమాలు లేకపోవడం, కుటుంబ కలహాల కారణంగా తీవ్ర ఒత్తిడికి విజయ్ గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే విజయ్ సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తుంది.