ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు వెంకీమామ‌లో `ఎన్నాళ్ల‌కో.. ` సాంగ్ విడుద‌ల‌

cinema |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 11:07 PM



విక్టరీ వెంక‌టేశ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `వెంకీమామ‌`. రీసెంట్‌గా ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ సాంగ్‌కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. కాగా న‌వంబ‌ర్ 16న‌ రెండో సాంగ్‌ను విడుద‌ల చేయ‌బోతున్నారు. `ఎన్నాళ్ల‌కో..` అంటూ సాగే ఈ సాంగ్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో వింటేజ్ లుక్‌లో వెంక‌టేష్ ఆక‌ట్టుకుంటున్నారు. ఈ పోస్ట‌ర్‌లో పాయ‌ల్‌రాజ్‌పుత్ కూడా ఉంది. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే రెట్రోసాంగ్ ఇది. మ్యూజికల్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌కత్వంలో సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకాల‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com