ఎక్కడికి పోతావ్ చిన్నవాడా చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది నందిత శ్వేత. ఈ మూవీ సూపర్ హిట్ అయినా కానీ అమ్మడు మళ్లీ తెలుగు లో కనిపించలేదు. సాధారణంగా కొత్త హీరోయిన్ కు ఓ హిట్ వస్తే ఆ వెంటనే వరుస ఛాన్స్ లతో అలరిస్తారు..కానీ ఈమె మాత్రం ఆలా చేయకుండా తమిళం లోకి వెళ్లి పోయి అక్కడ సినిమాలు చేసింది. దీంతో ఈమెకు తెలుగు లో అవకాశాలు లేకుండా పోయాయి. తాజాగా మీడియా తో ముచ్చటించిన ఈమె తెలుగు ఇండస్ట్రీ ని వదిలి తప్పు చేసా అని చెప్పుకొచ్చింది.తెలుగు లో ఫస్ట్ సినిమానే సూపర్ హిట్ అయినా కానీ నేను తెలుగు ఇండస్ట్రీ వదిలి తమిళ సినిమాలు చేసి తప్పు చేసా..అక్కడ చేసిన చిత్రాలేవీ కూడా పెద్దగా పేరు తేలేకపోయ్యాయి. కానీ తెలుగు లో చేసిన ఒక్క సినిమానే మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటి ఇండస్ట్రీ ని వదిలి చాల తప్పు చేసా..ఇక అలాంటి తప్పులు మళ్లీ చేయను..ఖచ్చితంగా నాకు మళ్లీ తెలుగు లో అవకాశాలు వస్తాయని నమ్ముతున్నాని తెలిపింది.