ఇండియాలో బాలీవుడ్ హీరోలతో తలపడుతూ ఆ రేంజ్ లో దూసుకుపోతున్న క్రేజీ స్టార్ రజనీకాంత్. కొన్ని డికేడ్స్ గా సినిమాలు చేస్తున్నా రజనీకాంత్ స్టామినా కానీ, ఆయనపై ఎట్రాక్షన్ కానీ ఏమాత్రం తగ్గలేదు. ఆ క్రేజ్ రజనీ హిట్స్ కు, ఫ్లాప్స్ కు సంబంధం లేనిది. రజనీ మూవీ రోబో 2.0 త్వరలో రాబోతోంది. దాని వర్క్ కూడా శరవేగంగా పూర్తి అవుతుంది. అయితే ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో కాలా అనే సినిమా చేస్తున్నాడు రజనీకాంత్. ఈ చిత్రాన్ని వండర్ బార్ ఫిలింస్ బ్యానర్‌పై రజనీ అల్లుడు ధనుష్ నిర్మిస్తున్నారు. ఇందులో రజనీకి జోడీగా బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ నటిస్తోంది. 2018లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా టీం ప్లాన్ చేస్తుంది.
ఈ రోజు రజనీకాంత్ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ కాలా చిత్రంలో తలైవా సెకండ్ లుక్ విడుదల చేసింది. ఇందులో కళ్ళాద్దాలు పెట్టుకొని మసితో నల్లగా కనిపిస్తున్నాడు రజనీ. అభిమానులని ఈ లుక్ ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించనున్నాడు. కబాలికి పనిచేసిన పలువురు సాంకేతిక నిపుణులు కాలా చిత్రానికీ పని చేయనున్నట్లు తెలుస్తోండగా, ఈ చిత్రంలోని కీలక పాత్రలో దర్శక నటుడు సముద్రగని నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏడు సార్లు నేషనల్ అవార్డు పొందిన శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్ గా పని చేయనుండగా, థేరి మరియు తనీ ఒరువన్ చిత్రాలకి ఫైట్ మాస్టర్ గా పనిచేసిన దిలీప్ సుబ్బరాయన్ కాలా చిత్రానికి పనిచేస్తున్నాడు.