ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం అవుతున్న “సాహో”

cinema |  Suryaa Desk  | Published : Mon, Nov 18, 2019, 06:46 PM



బాహుబలి రెండు చిత్రాల తర్వాత కూడా టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ రెండు సినిమాల దెబ్బకు ప్రభాస్ ఆల్ ఇండియా హీరో అయ్యిపోయాడు.అలాగే బాలీవుడ్ స్టార్ హీరోలకే తన ప్లాప్ చిత్రంతో చెమటలు పట్టించాడు.సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం దేశంలోనే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకుంది.అలా ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా భారీ హైప్ నడుమ విడుదల అయ్యి ఒక్క హిందీలో తప్ప అన్ని భాషల్లోనూ నిరాశపరిచింది.అయినా సరే 2019 బాక్సాఫీస్ వసూళ్ల పరంగా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇంకా మంచి టాక్ కానీ వచ్చి ఉంటే మరింత వచ్చేవి ఏమో కానీ ఈ సినిమా మాత్రం ఇప్పుడు మరోసారి గ్రాండ్ గా విడుదలకు సిద్ధమవుతుంది.బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్క మనదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మారుమోగింది.అలన్తి వాటిలో చైనా కూడా ఒకటి.అక్కడ ఈ చిత్రం విడుదల అవుతుందని ఎప్పుడో వార్తలు వచ్చాయి.మళ్ళీ ఇంత కాలం తర్వాత ఇప్పుడు వినిపిస్తున్నాయి. చైనా లోని ఈ చిత్రం భారీ ఎత్తున 10 వేలకు పైగా థియేటర్స్ లో విడుదల కాబోతుందని అందుకు సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తవుతున్నాయని తెలుస్తుంది.అంతే కాకుండా చైనీస్ భాషలో సినిమా తాలూకా ప్రమోషన్స్ కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి.టాక్ పరంగా పక్కన పెడితే సాహో మాత్రం ఓ భారీ యాక్షన్ మరియు విజువల్ థ్రిల్లర్ గా తప్పకుండా నిరాశ పరచదు.మరి ఈ చిత్రం అక్కడ ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com