హిందీలో మొదలైన “ఫీటప్ విత్ స్టార్స్” షో లానే తెలుగులో కూడా మొదలు పెట్టారు. వెండి తెరపై విఫలం అయ్యినా సరే బులితెరపై మాత్రం సూపర్ హిట్ అనిపించుకున్న మంచు లక్ష్మి దీని నిర్వహణతో పాటు యాంకరింగ్ బాధ్యతలు చేపట్టింది. ఈ “ఫీటప్ విత్ స్టార్స్” టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోలు మరియు హీరోయిన్స్ తో తమ బెడ్ పైనే ఉండి చేసే ఈ షో లో ఇప్పటికే సమంత,శృతి హాసన్ మరియు కాజల్ లాంటి హీరోయిన్స్ ఇంటర్వ్యూ లు చేసింది లక్ష్మి. కానీ గత కొన్ని వారాల నుంచి ఒక్క ఎపిసోడ్ కూడా బయటకు రాలేదు. చివరగా కాజల్ తో చేసిన ఇంటర్వ్యూ మాత్రమే వచ్చింది. సాధారణంగా ఒక వారం గ్యాప్ లో ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు చాలా రోజులవుతున్నా.... ఈ కార్యక్రమం ఎపిసోడ్ ఒక్కటి కూడా బైటకు రాకపోవటం చూస్తుంటే ఈ షో ఆగిపోయినట్టే అని కొందరు గుసగుసలాడుతున్నారు. అయితే వేరే పెద్ద స్టార్ తో గ్రాండ్ ఇంటర్వ్యూ ఏమన్నా ప్లాన్ చేస్తున్నందుకే వాటి షూటింగ్ జరక్క ప్రసారాలకు విఘాతం కలుగుతోందన్నది కొందరి మాట. మరి నిజానిజాలేంటన్నది తెలియాల్సి ఉంది.