ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరు 152 మూవీ లేటెస్ట్ అప్డేట్!

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2019, 02:20 PM



చిరంజీవి 152వ సినిమా కొరటాల దర్శకత్వంలో రూపొందనుంది. వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన అన్ని పనులను జూలై నాటికి పూర్తిచేసి, ఆగస్టు 14వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో కొరటాల వున్నట్టుగా సమాచారం. దాదాపు అదే డేట్ ఖరారయ్యే అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ ఆల్రెడీ పూర్తయింది. నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. కథానాయికగా 'త్రిష' ఖరారైపోయిందనే అంటున్నారు. ప్రాచీన దేవాలయాలు .. ఆ దేవాలయ భూముల ఆక్రమణకి సంబంధించిన నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. ఇతర వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com