ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మిస్ మ్యాచ్' ట్రైలర్ రీలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2019, 02:35 PM



ఉదయ్ శంకర్ .. ఐశ్వర్య రాజేశ్ జంటగా నిర్మల్ కుమార్ దర్శకత్వంలో 'మిస్ మ్యాచ్' రూపొందింది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ ఫైటర్ గా నటించింది. శ్రీరామ్ రాజు - భరత్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక ట్రైలర్ ను వదిలారు. నాయకా నాయికలు .. ఇరు కుటుంబ సభ్యులకి సంబంధించిన కీలక సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. కుస్తీ పోటీలలో పాల్గొనే కథానాయిక హీరో ప్రేమలో పడటం, అతనితో పెళ్లికి ఆమె కుస్తీ పోటీల్లో పాల్గొనడమే అభ్యంతరం కావడం ఈ ట్రైలర్లో చూపించారు. లవ్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. 'కౌసల్య కృష్ణమూర్తి' తరువాత ఐశ్వర్య రాజేశ్ చేసిన ఈ సినిమా, ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com