ట్రెండింగ్
Epaper    English    தமிழ்

JFW కోసం అమ్మడు ఇచ్చిన స్టిల్స్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2017, 04:35 PM



మలయాళీ ముద్దుగుమ్మలు ఈ ఏడాది తెలుగులో క్రేజ్ ని బాగానే అందుకున్నారు. ముఖ్యంగా క్యూట్ గా నవ్వుతోనే హృదయాలను దోచుకునే అనుపమ పరమేశ్వరన్ అయితే మంచి గుర్తింపు దక్కించుకుంది. అమ్మడి సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా తన అందంతో అందరిని బలే ఆకట్టుకుంది. అంతే కాకుండా కొన్ని మంచి ఆఫర్స్ ని కూడా అందుకుంటోంది. అమ్మడికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. 


దీంతో అప్పుడపుడు కొన్ని ఫొటోస్ ని పోస్ట్ చేసి ఖుషి చేసే ఈ భామ రీసెంట్ గా ఒక ప్రముఖ మ్యాగజిన్ కి ఇచ్చిన ఫొటో షూట్ యొక్క వీడియోతో దర్శనం ఇచ్చింది. వీడియోలో  JFW కోసం అమ్మడు ఇచ్చిన స్టిల్స్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.  ఏ అందంలో అయినా కొన్ని నెగిటివ్ పాయింట్స్ ని వెతకొచ్చు కానీ అనుపమ అందంలో అవి కనిపెట్టడం చాలా కష్టమని అభిమానులు చెబుతున్నారు. అందమే అనుపమగా ఒక అమ్మాయి రూపంలో వచ్చింది అంటున్నారు.  


ఇక అనుపమ తన ఇష్టాలను అనుభూతులను ఆ వీడియోలో తెలిపింది. కొన్ని ప్రశ్నలకు చాలా తెలివిగా కూడా సమాధానం చెప్పింది. నివిన్ - దుల్కర్ వంటి హీరోల్లో ఎవరు బెస్ట్ అంటే ఇద్దరు మంచి నటులే.. ఎవరి స్టైల్ వారికీ ఉందని అలాగే బెస్ట్ యాక్టర్ ఎవరంటే చాలా మంది ఉన్నారు. ఒకరని చెప్పలేము అని స్వీట్ గా సమాధానం ఇచ్చింది ఈ ప్రేమమ్ బ్యూటీ.  





 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com