ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెన్సేషనల్ పేస్ అఫ్ 2017: సాయి పల్లవి

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2017, 05:19 PM



ఒక్క సినిమా కూడా విడుదల కాకుండా ఫ్యాన్స్ ఏర్పడటం చాలా అరుదు. కానీ సాయి పల్లవి విషయంలో జరిగిపోయింది. మలయాళం ‘ప్రేమమ్’ తో సెన్సేషనల్ స్టార్ అయ్యింది సాయిపల్లవి. ఈ సినిమాని మలయాళంలో చూసి ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు మిగతా సినీ జనాలు. ఫిదాతో టాలీవుడ్ కి వచ్చింది పల్లవి. ఇది ఆమెకు మొదటి తెలుగు సినిమా. అయితే ఆల్రెడీ ప్రూవ్ అయిన హీరోకి వచ్చినంత అప్లాజ్ వచ్చింది సాయి పల్లవి ఎంట్రీ సీన్ కి. ట్రైన్ ను క్యాచ్ చేయడానికి ‘భానుమతి’ పరుగెత్తుకుంటూ వస్తుంటే థియేటర్లలో విజిల్స్ పడిపోయాయి.మలయాళ ‘ప్రేమమ్‌’ చూసి సాయి పల్లవికి ఎందుకంతగా ఫిదా అయిపోయారో, ఆమెని అంత స్పెషల్‌గా ఎందుకు చూస్తారో ఇందులో ‘భానుమతి’గా ఆమెని చూస్తే తెలిసింది. సొంత డబ్బింగ్‌తో తెలంగాణ యాసని పొల్లుపోకుండా మాట్లాడుతూ.. తెరపై నటిస్తోన్న హీరోయిన్‌లా కాకుండా మనకి బాగా తెలిసిన అమ్మాయి భానుమతిని మాత్రమే కనిపించేట్టు చేసిన సాయి పల్లవి ఆ చిత్రం సక్సెస్ లో బిగ్గెస్ట్‌ ఎస్సెట్‌. ఒక అంద‌మైన ప‌ల్లెటూరు, అంద‌మైన మ‌నుషుల నేప‌థ్యంలో సాగే ఓ అంద‌మైన ప్రేమ‌క‌థలో.. తెలంగాణ యాస మ‌రింత అందంగా వినిపిస్తుంది.. సాయిపల్లవి మాట్లాడుతుంటే. ‘






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com