ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రవితేజ సినిమా కథానాయిక విషయంలో రానున్న స్పష్టత

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 18, 2017, 01:49 PM



'సోగ్గాడే చిన్ని నాయనా'తో నాగార్జునకు .. 'రారండోయ్ వేడుక చూద్దాం'తో చైతూకు హిట్స్ ఇచ్చాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. కుటుంబాలు .. బంధాలు .. అనుబంధాల మధ్య అందమైన కథలను అల్లడంలో ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు. అలాంటి కల్యాణ్ కృష్ణ .. రవితేజ హీరోగా ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా పల్లె వాతావరణంలో .. కుటుంబ నేపథ్యంలో కొనసాగనుందని అంటున్నారు. ఎమోషన్ ను ..కామెడీని కలిపి అందించేదిగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. కల్యాణ్ కృష్ణ ఇంతకు ముందు చేసిన 'సోగ్గాడే చిన్ని నాయనా'లో లావణ్య త్రిపాఠి నాయిక అయితే, 'రారండోయ్ వేడుక చూద్దాం'లో రకుల్ కథానాయికగా నటించింది. అందువలన తాజా చిత్రంలో ఈ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రకుల్ ను సంప్రదిస్తున్నారట .. ఆమె కుదరదంటే లావణ్య త్రిపాఠిని తీసుకునే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే ఈ సినిమాను లాంచ్ చేసి .. అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారు.    






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com