బెంగళూరు: బెంగళూరు మాన్యతటెక్ పార్కులోని వైట్ ఆర్చ్డ్ హోటల్లో బాలీవుడ్ నటి సన్నీలియోన్‌తో నిర్వహించతలపెట్టిన ఈవెంట్‌కు అనుమతి ఇవ్వలేమని సిటీ పోలీస్ కమిషనర్ సునీల్‌కుమార్ తెలిపారు. డిసెంబర్ 31న పోలీసులంతా బందోబస్తు విధుల్లో ఉంటారని..శాంతి భద్రత సమస్యల దృష్ట్యా ఈవెంట్‌కు అనుమతి ఇవ్వడం లేదని వెల్లడించారు. సన్నీలియోన్‌కు వ్యతిరేకంగా ప్రొ-కన్నడ గ్రూప్ కర్నాటక రక్షణ వేదిక యువసేన ఆందోళన నిర్వహించింది. న్యూ ఇయర్ సందర్భంగా సన్నీలియోన్‌తో ఏర్పాటు చేస్తున్న ఈవెంట్‌ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన కారులు పెద్ద సంఖ్యలో మన్యతటెక్ పార్కు ముందు చేరి..సన్నీలియన్ ఫొటోలు, పోస్టర్లను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.