ఫిష్ వెంకట్‌పై కేసు నమోదు

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 12, 2017, 04:13 PM
 

తెలుగు సినీ నటుడు ఫిష్‌వెంకట్‌‌పై కేసు నమోదైంది. మద్యం తాగి నానా యాగీ చేస్తూ ఓ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ వస్తున్న ఆయనపై పోలీసులు చివరకు కేసు పెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఏ పవర్‌హౌజ్‌ బస్తీలో హంగామా చేశాడు. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి మద్యంతాగి గొడవ చేశాడు. ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దాంతో ఆయనను పిలిపించి సున్నితంగా మందలించి వదిలేశారు. అయినా అతని తీరు మారలేదు.


సినిమాల్లో విలన్‌ పక్కన చిన్నచిన్న వేషాలు వేసే నటుడు వెంకట్‌కు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. తన కూతురు కొత్తగూడెంలోని ఏ పవర్‌హౌజ్‌ బస్తీకి చెందిన మెడికల్‌షాపు లో పనిచేసే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించాడు.వెంకట్‌ కూతురు నాలుగేళ్లుగా ఏ పవర్‌హౌజ్‌ బస్తీలో నివాసం ఉంటోంది. వారి ఇంటికి పక్కనే ఉన్న వేముల రాజేశం, వేముల ఉపేంద్ర, వేముల ప్రసాద్‌‌లతో వివాదం ఏర్పడింది. ఆ గొడవ తీవ్ర రూపం దాల్చింది. అది పోలీసుల దాకా వెళ్లింది.


 
Recent Post