ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండకు హీరోయిన్స్ నో..!

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 06, 2019, 08:15 PM



రౌడీ హీరో విజయ్ దేవరకొండతో సినిమా ఛాన్స్ వస్తే ఎవరైనా కాదంటారా చెప్పండి. తన ప్రతి సినిమా ఎంతో స్పెషల్ గా ఉండాలని చూస్తున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఓ సినిమా ప్లానింగ్ లో ఉంది. బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ ఫైటర్ అని పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.
సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని చూస్తున్నారు. అందుకే సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్, కియరా అద్వానిలలో ఒకరిని తీసుకోవాలని అనుకున్నారు. విజయ్ తో ఛాన్స్ వస్తే చేస్తా అని ఇంటర్వ్యూస్ లో చెప్పిన జాన్వి ఇప్పుడు ఆ ఛాన్స్ వస్తే కాదని చెప్పిందట. ఇక కియరా కూడా డేట్స్ అడ్జెస్ట్ చేయలేక విజయ్ మూవీ ఛాన్స్ మిస్ చేసుకుందని తెలుస్తుంది. చేసేదేం లేక ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నే విజయ్ హీరోయిన్ గా ఫైనల్ చేశాడట పూరి జగన్నాథ్. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు పూరి జగన్నాథ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com