ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శిల్పకళావేదికలో 'ఆటగదరా శివ' సంగీత విభావరి

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 08, 2019, 04:27 PM



నటుడు, రచయిత, కవి, దర్శకుడు తనికెళ్ల భరణి రాసిన 'ఆటగదరా శివ' గేయ కావ్యం సంగీత విభావరిగా సంగీతాభిమానుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది జనవరి 5వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ఈ కార్యక్రమాన్ని ప్రదర్శించనున్నారు. స్వతహాగా శివభక్తుడైన తనికెళ్ల భరణి రాసిన శివతత్వాలు అనేకం ఇప్పటికే జనంలోకి వెళ్లాయి. సంగీత దర్శకుడు, ప్రఖ్యాత వేణుగాన విద్వాంసుడు ఫ్లూట్ నాగరాజ్ ఈ 'ఆటగదరా శివ' తత్వాలకు సంగీత దర్శకత్వం అందించనున్నారు. ఇవామ్, తెలంగాణ కల్చరల్ అండ్ టూరిజం మినిస్ట్రీ సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని అలేఖ్య హోమ్స్ సమర్పిస్తోంది. ఈ కార్యక్రమానికి శ్రీమతి మణినాగరాజ్ రూపకల్పన చేయగా, హీరో సాయికుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. విశ్వవిఖ్యాత డ్రమ్మర్ శివమణి, గిటార్ వాద్యకారిణి మోహినీ డే పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి చెన్నైబృందం వాద్య సహకారం అందిస్తుంది. జంట నగరాలకు చెందిన గాయకులు ఈ పాటలు పాడతారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com