ట్రెండింగ్
Epaper    English    தமிழ்

27న వస్తున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’.

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 08, 2019, 04:36 PM



సంజయ్ ఇదామ, శ్రీనాధ్ మాగంటి, అహల్య సురేష్, ప్రియ హీరో హీరోయిన్లుగా రాహుల్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కిన చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’. జె కరుణ కుమార్ సోషల్ మెస్సేజ్ తో కూడిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నిన్నహైదరాబాద్ లో ఈ మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమం  జరిగింది. జీవిత రాజశేజర్ దంపతులు, మల్కాపురం శివకుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సంధర్భంగా పిల్లలకు ఒత్తిడితో కూడిన చదువుల వలన ప్రయోజనం ఉండదని, వారిలో ఉన్న నైపుణ్యాన్ని గ్రహించి ఆ దిశగా వారిని ప్రోత్సహించాలని, అందరూ డాక్టర్స్ ఇంజనీర్స్ ఐ పి ఎస్ లు కావాల్సిన పనిలేదని జీవిత దంపతులు చెప్పుకొచ్చారు. ఒత్తిడితో కూడిన చదువులు ఎందరో విద్యార్థుల ప్రాణాలు తీస్తున్నాయనే మంచి కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం విజయం సాధిస్తుందని వారు చిత్ర నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నటీనటులు మరియు దర్శక నిర్మాతలు చిత్ర విశేషాలు పంచుకున్నారు. స్టూడెంట్ అఫ్ ది ఇయర్ ఈనెల 27న విడుదల కానుంది. ఈ మూవీకి సంగీతం యాజమాన్య అందించారు. బి ఓబుల్ రెడ్డి సుబ్బారెడ్డి నిర్మాతగా మొదటి చిత్రం నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com