చైతూ గర్ల్ ఫ్రెండ్, కాబోయే భార్య సమంత లంగా ఓణీలో

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 12, 2017, 04:22 PM
 

టాలీవుడ్ హీరోయిన్, చైతూ గర్ల్ ఫ్రెండ్, కాబోయే భార్య సమంత లంగా ఓణీలో కనిపించింది. ఇదేదో రియల్ సీన్ కోసం కట్టిన లంగా ఓణీ కాదు.. రీల్ లైఫ్ కోసం. శివకార్తికేయన్‌ (రెమో కథానాయకుడు) హీరోగా తమిళ సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తెన్‌కాశీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో సమంత పాల్గొంది. ఇందులో విలేజ్ అమ్మాయిగా సమంత అలరించనుంది.


 


ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా తీసిన ఓ ఫోటోను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. రొమాంటిక్ కామెడీగా రూపుదిద్దుకునే ఈ చిత్రంలో సమ్మూ ట్రెడిషనల్‌గా కనిపించనుంది. 24ఎఎమ్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా శివకార్తీకేయన్ నయనతారతో కలిసి నటించిన వేలైక్కారన్ సినిమా ఈ ఏడాది విడుదలకు రెడీ అయ్యింది. ఆపై సమంతతో నటించనున్న కొత్త సినిమా వచ్చే ఏడాది తమిళ ప్రేక్షకులను అలరించనుందని సినీ యూనిట్ వెల్లడించింది.
Recent Post