ఐ డోన్ట్ కేర్.. తాప్సీ అస్సలు తగ్గట్లేదుగా

  Written by : Suryaa Desk Updated: Wed, Jul 12, 2017, 04:35 PM
 

హీరోయిన్‌గా తనకు మొదట అవకాశం ఇచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుపై నటి తాప్సీ ఇటీవల ఓ షోలో చేసిన కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. కృతజ్ఞతాభావం లేకుండా ఓ లెజండరీ డైరెక్టర్ గురించి ఆమె చులకనగా మాట్లాడడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ విషయంపై స్పందించిన తాప్సీ.. రాఘవేంద్రరావు గారిని అవమానిస్తూ తను ఏదీ మాట్లాడలేదని నిజాలే మాట్లాడనని చెప్పుకొచ్చింది. దర్శకుడిగా హీరోయిన్ల నాభి ప్రాంతంపై పూలు, పండ్లతో కొట్టే రాఘవేంద్రరావు తన నాభి ప్రాంతంపై కొబ్బరిచిప్ప పెట్టి కొట్టడంలో రొమాన్స్ ఏంటో తనకు అర్ధం కాలేదని ఆ విషయమే చర్చించానని, అందులో తప్పుగా ఏం మాట్లాడలేదని చెబుతోంది.


''ఆయన స్టయిల్ ఎలా ఉంటుందో నేను చెప్పాను. దాని గురించి తప్పుగా భావిస్తే అది మీ సమస్య.. నేను చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన బాధ పడలేదు. నేను మాట్లాడినా వీడియోను ఆయన తన కుటుంబంతో కలిసి చూశారు. నేను కూడా మరొకసారి చూశాను. ఆ తరువాత వీడియో గురించి


మాట్లాడుకొని నవ్వుకున్నాం. నా మాటలు రాఘవేంద్రరావు గారికి తప్పుగా ఏం అనిపించలేదు. దానికి వేరెవరో బాధ పడితే నాకు అనవసరం. అది నా తప్పు కాదు. ఎవరినో బాధ పెట్టాలని, కించపరచాలనేది నా ఉద్దేశం కాదు. నేను నిజాలే మాట్లాడాను. నాపై బురద చల్లాలనుకునే వారికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. పనిలేని వాళ్ళను నేను పట్టించుకోను'' అని వెల్లడించింది. ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో ఈమె నటించిన ‘ఆనందో బ్రహ్మ’ చిత్రం ఆగష్టు 18 విడుదలకానున్న సంగతి తెలిసిందే.
Recent Post