ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా ఆయనే 'శీనయ్య'...'వరల్డ్ ఫేమస్ లవర్'...ఐశ్వర్య లుక్‌

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 12, 2019, 09:29 PM



విజయ్ దేవరకొండ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో నలుగురు హీరోయిన్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో విజయ్‌కి భార్యగా నటిస్తున్న ఐశ్వర్యా రాజేష్‌ లుక్‌ను ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ఇందులో ఐశ్వర్యా రాజేష్‌.. సువర్ణ పాత్రలో డీ గ్లామరస్‌గా కనిపించి సర్ ప్రైజ్ చేసింది. ‘నా పేరు సువర్ణ.. ఆ ఆయన పేరు శీనయ్య.. మా ఆయనే ‘వరల్డ్ ఫేమస్ లవర్’.. మా శీనయ్యను ప్రేమికుల రోజున కలుద్ధాం’ అంటూ శీనయ్యతో రొమాన్స్ చేస్తున్న సువర్ణ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పోస్టర్‌ను వదిలింది. ఇక ఈ చిత్ర షూటింగ్ పూర్తికావడంతో ప్రమోషన్స్ వర్క్స్‌ని వేగవంతం చేశారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ ఫస్ట్‌లుక్ విడుదల చేయగా.. ‘వరల్డ్ ఫేమస్ లవర్’‌కి భార్యగా నటించిన ఐశ్వర్య లుక్‌ను నేడు విడుదల చేశారు. ఇక రేపు (డిసెంబర్13) ఇజా బెల్లా, 14న క్యాథరిన్ త్రెసా, 15న రాశీఖ‌న్నాల‌కు సంబంధించిన లుక్‌లు విడుదల చేస్తున్నారు. అలానే.. ఈ మూవీ టీజర్‌ను జనవరి 3 విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించింది చిత్ర యూనిట్. ఫిబ్రవరి 14న ప్రేమికులు దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’‌ చిత్రానికి క్రాంతిమాధ‌వ్ దర్శకత్వం వహించారు. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ కె.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపీ సుంద‌ర్ సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com