నూనూగు మీసాల వయసులోనేజయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ కొన్నేళ్ల పాటు కెరీర్ ఒడిదుడుకులకు గురైనా, ఇష్క్ చిత్రంతో పుంజుకుని టాలీవుడ్లో మంచి మార్కెట్ సంపాదించు కోవటంతో పాటు. వరుస చిత్రాలలో ఛాన్సులందుకుని బిజీగా గడుపుతున్నాడు. నితిన్ కెరీర్ ఆరంభం నుంచి వివాదాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. హీరోలు, హీరోయిన్ల విషయంలో అనేక ఎఫైర్ రోమర్స్ వినిపిస్తుంటాయి. కానీ నితిన్ కు అలాంటి రిమార్క్స్ లేవు.
తాజాగా నితిన్ పెళ్లి విషయం ఇంట్లో తొందరపడుతున్నా కారణం చెప్పకుండా వాయిదా వేస్తూ వస్తున్నాడట నితిన్. అయితే ఇంట్లో వాళ్లు ఆరాలు తీస్తే నితిన్ కొంతకాలంగా ఓ తెలుగు అమ్మాయితో ప్రేమలో మునిగి తేలుతున్నట్టు తెలుసింది. ఆమె సినీ పరిశ్రమకు చేసిన అమ్మాయి కాక పోవటంతో వివరాలు సేకరించి, పెళ్ళికి ఇరు కుటుంబ సభ్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టు తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ లో పెళ్లి ఏర్పాట్లు చేసుకునేలా నితిన్ ప్లాన్ చేస్తున్నాడట. దీనిపై నితిన్ త్వరలో ఓ ప్రకటన చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నితిన్ ప్రస్తుతం వెంకీకుడుముల దర్శకత్వంలో చేస్తున్న భీష్మ ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రష్మిక మందన హీరోయిన్.