సీరియస్, యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా ఏ పాత్రలనైన పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులకి వినోదాన్ని అందించడంలో మహా నేర్పరి విక్టరీ వెంకటేష్. ఈ రోజు వెంకటేష్ 59వ బర్త్‌డే. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు, పలువురు ప్రముఖులు ఆయనకి శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు. ఒకవైపు కుర్ర హీరోలని ప్రోత్సహిస్తూ మరో వైపు మంచి సినిమాలు చేస్తున్న వెంకటేష్‌కి టాలీవుడ్ సినీ లోకం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మహేష్ బాబు, అనీల్ రావిపూడి, కోన వెంకట్, అనీల్ సుంకర, రాశీ ఖన్నా, నితిన్, శ్రీను వైట్ల, బాబీ, రానా ఇలా పలువురు ప్రముఖులు వెంకీకి బర్త్‌డే విషెస్ అందించారు.