ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకట్టుకుంటున్న ‘అశ్వథ్థామ' సాంగ్ ప్రోమో

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2019, 12:44 PM



 హీరో నాగ శౌర్య‌, బ‌బ్లీ బ్యూటీ మెహ‌రిన్ జంట‌గా ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై ఉషా ముల్పూరి నిర్మాత‌గా ‘అశ్వథ్థామ’ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ వీడియో సాంగ్ ప్రోమో ‘నిన్నే నిన్నే’ రిలీజ్ అయింది. శ్రీ చరణ్ పాకల అందించిన క్లాసిక్ ట్యూన్ కి రమేష్ వకాచర్ల భావాత్మకమైన పదాలతో చక్కని సాహిత్యాన్ని అందించారు. అలాగే ఈ పాటను ఆలపించిన అర్మాన్ మాలిక్ వాయిస్ కూడా సాంగ్ ను మరో స్థాయిలో నిలబెట్టింది. మొత్తానికి ఈ చిన్న ప్రోమోనే.. సాంగ్ ఎలా ఉండబోతుందో చెప్పింది. కాగా శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో రానున్న ఈ సినిమాతో నూత‌న ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ తెలుగు తెరకు ప‌రిచ‌యం అవుతున్నారు. వచ్చే ఏడాది జనవరి 31న ఈ మూవీ విడుదల కానుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com