బాలకృష్ణ, బోయపాటి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు వచ్చిన వార్తలను సోనాక్షి సిన్హా కొట్టిపారేసింది. బాలకృష్ణ సినిమాలో నటిస్తున్నాననే వార్తలు నిజం కాదు. నేను చేయబోయే కొత్త సినిమా విషయాలను త్వరలో వెల్లడిస్తానని సోనాక్షి స్పష్టం చేసింది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో 105వ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబోలో వస్తోన్న ప్రాజెక్టులో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షిసిన్హాను ఎంపిక చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై సోనాక్షి సిన్హా ట్విట్టర్ ద్వారా స్పందించింది.మరోవైపు బాలయ్య కొత్త చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటించనున్నట్లు వార్తలు రాగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. బాలకృష్ణ నటించిన రూలర్ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది.