అందాల ఆరబోత విషయంలో రకుల్ ఏ మాత్రం కాంప్రమైజ్

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 13, 2017, 01:53 PM
 

టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు పక్క భాషల్లో కూడా అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకునేందుకు.. ఇక అడుగు దూరంలో మాత్రమే ఉన్న రకుల్.. బాలీవుడ్ లో అవకాశం రావడంతో తెగ సంతోషంగా ఉంది. 


ఇదే సమయంలో.. తమిళ్ సినిమాను కూడా ఫుల్ స్పీడ్ లో పూర్తి చేసేస్తోంది రకుల్ ప్రీత్. తీరన్ అధిగారం ఒండ్రు అనే మూవీలో కార్తి సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా.. ఇప్పుడు ఆ మూవీ షూటింగ్ స్పాట్ పిక్స్ కొన్ని ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఒకపాట చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలు కనిపిస్తుండగా.. వీటిలో రకుల్ భలే గ్లామరస్ కనిపించేస్తోంది. అమ్మడి కాస్ట్యూమ్స్ కూడా సూపర్బ్ గా ఆకట్టుకుంటున్నాయి. అందాల ఆరబోత విషయంలో రకుల్ ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదనే సంగతి తెలిసిపోతోంది. 


అరంగేట్రంలోనే తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్న రకుల్ కి.. కోలీవుడ్ లో ఘన స్వాగతం లభించనుందనే అంచనాలు ఉన్నాయి. పైగా ఈ లోపే మురుగదాస్ డైరెక్షన్ లో స్పైడర్ రిలీజ్ కానుండడంతో.. అమ్మడి క్రేజ్ బాగానే పెరిగిపోతోంది. ఇక ఈ పాటకు సంబంధించిన కాస్ట్యూమ్స్ ను డిజైనర్ నీరజ కోన అందించడం విశేషం. 




Recent Post