ఎన్టీఆర్ షోకు ఎక్స్ ట్రా గ్లామర్ తీసుకురానున్న శ్రీముఖి?

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 13, 2017, 02:11 PM
 

ఓవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు టీవీ షోలలో మెరుస్తున్న శ్రీముఖి... జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనబోతోంది. 'పటాస్' షోతో పాటు మరో రెండు మూడు టీవీ షోలతో మాంచి పాప్యులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి పేరు బిగ్ బాస్ షో కోసం ముంబైకి వెళుతున్న వారి జాబితాలో ఉందనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మరి రెండున్నర నెలలపాటు శ్రీముఖి ముంబైలో సెటిలైపోతే ఇక్కడి టీవీ షోల పరిస్థితి ఏంటనే సందేహం కూడా తలెత్తుతోంది. ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ లో శ్రీముఖి ఉంటే మాత్రం... ఆ షోకు ఎక్స్ ట్రా గ్లామర్ వచ్చినట్టే.  
Recent Post