నాని సరదాగా ఉంటాడు.. ఇగో కనిపించదు

  Written by : Suryaa Desk Updated: Thu, Jul 13, 2017, 04:54 PM
 

జెంటిల్మన్ సినిమా తర్వాత మలయాళీ ముద్దుగుమ్మ నివేదా థామస్‌ అద్భుత అభినయంపై అన్నివర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. తాజాగా నిన్ను కోరి సినిమాలో చూసిన తర్వాత నివేదా వన్ షో వండర్ కాదు అని స్పష్టం చేసింది. నిన్ను కోరి చిత్రంలో నివేదా నటన ముందు నాని కూడా చిన్నపోయిండా అనే ఫీలింగ్‌ను కలిగించింది. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన సక్సెస్ ఆనందాన్ని పంచుకొన్నది.


జెంటిల్మన్ సినిమా షూటింగ్ అప్పుడు నాకు టాలీవుడ్ అంతా కొత్త. ప్రస్తుతం చాలా పరిచయాలు ఏర్పడ్డాయి. నిన్ను కోరి సినిమా షూటింగ్‌లో నానితో ఏర్పడిన పరిచయం ఇప్పుడు బలమైన స్నేహంగా మారింది. నాని చాలా సరదాగా ఉంటాడు. స్టార్ అనే ఇగో ఎక్కడా కనిపించదు. తన సహాయం కావాల్సి వస్తే ముందు వెనుక ఆలోచించకుండా చొరవ తీసుకొంటాడు అని నివేదా చెప్పింది.ప్రస్తుతం జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న జై లవకుశ చిత్రంలో నటిస్తున్నాను. మూడో చిత్రంతోనే ఎన్టీఆర్ సరసన నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. జై లవకుశలో నటించడం ఓ గొప్ప అనుభూతి. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిని నటిస్తున్నాను అని నివేదా వెల్లడించింది.


త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందించే సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ చిత్రంలో చెల్లెలు పాత్ర. హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలో సిస్టర్ పాత్ర చేయడం వల్ల కెరీర్ ముప్పు ఏర్పడే అవకాశముందనే ఉద్దేశంతో ఆ పాత్రను ఒప్పుకోలేదు. ఆ మాటను చెప్పడానికి చాలా బాధపడ్డాను. పవన్‌తో సినిమా వదులుకోవడం దురదృష్టమే, మున్ముందు ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని నివేదా తెలిపింది.


 


 
Recent Post