పంట పొలాల మధ్య.. ట్రాక్టర్‌ను నడిపిస్తూ కింగ్ ఖాన్

  Written by : Updated: Thu, Jul 13, 2017, 05:34 PM
 

ముంబై: బాలీవుడ్ స్టార్ షారుక్‌ఖాన్ జబ్ హ్యారీ మెట్ సెజల్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాద్ షా తన కొత్త మూవీ ప్రమోషన్స్‌ను డిఫరెంట్‌గా నిర్వహిస్తున్నాడు. ఇటీవలే డ్యాన్స్ రియాలిటీ షోలో సందడి చేసిన షారుక్..తాజాగా ట్రాక్టర్ నడిపాడు. కింగ్ ఖాన్ ట్రాక్టర్‌ను నడిపిస్తూ.. పంట పొలాల మధ్య నుంచి వెళుతూ తన ఫ్యాన్స్‌కు అభివాదం చేశాడు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా లూథియానాలో పంట పొలాల మధ్య సందడి చేసిన షారుక్ ఫొటోలు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇంతియాజ్ అలీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో షారుక్‌కు జోడీగా అనుష్క శర్మ నటిస్తుంది. త్వరలో ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. 
Recent Post