ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో రానా 'విరాటపర్వం' !

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 19, 2020, 06:00 PM



వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా కథానాయకుడిగా 'విరాటపర్వం' చిత్రం రూపొందుతోంది. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలో జరుగుతోంది. అడవి నేపథ్యంలో రానా తదితరులపై గెరిల్లా తరహా పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలు ఈ పోరాట సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. ప్రియమణి .. టబు .. ఈశ్వరీరావు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా.. తన పాత్ర తన కెరియర్లో చెప్పుకోదగినవిగా గుర్తుండిపోతాయని రానా భావిస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com