ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్చగా ‘కీర్తి’ అదరహో

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 20, 2020, 01:54 PM



మలయాళ సూపర్ స్టార్  మోహన్ లాల్.. అర్జున్.. కీర్తీ సురేష్, మంజు వారియర్, సునీల్‌ శెట్టి, కల్యాణీ ప్రియదర్శన్‌  ముఖ్య పాత్రల్లో నటిస్తున్న  మలయాళ మూవీ  ‘మరక్కర్‌: అరబికడలింటే సింహం’. 16వ శతాబ్దానికి చెందిన కుంజాలి  మరక్కర్‌ అనే  నావికుడి  జీవితం ఆధారంగా ఈ  చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా ఈ   సినిమా  చిత్రీకరణ  పూర్తయింది. మోహన్‌లాల్‌  యంగ్‌  పాత్రలో  ఆయన  కొడుకు ప్రణవ్‌ మోహన్‌లాల్‌ నటించారు. ఆర్చ అనే పాత్రలో  కీర్తీ సురేష్‌ నటించింది. కీర్తి  క్యారెక్టర్‌ లుక్‌ను విడుదల చేసింది  చిత్రబృందం. ఆర్చ లుక్‌ ఆదరహా  అంటోంది మాలీవుడ్‌. ఈ  ఏడాది మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా చిత్రాన్ని రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఇది హిస్టారికల్ మూవీ. ఈ చిత్రానికి ప్రియదర్శన్  డైరెక్టర్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com