ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెదనాన్న పుట్టినరోజు వేడుకల్లో సందడి చేసిన ప్రభాస్...

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 20, 2020, 03:48 PM



రెబెల్ స్టార్ కృష్ణంరాజు 80వ పుట్టిన‌రోజు నేడు. సోమ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆదివారం గ్రాండ్ పార్టీ జ‌రిగింది. ఈ వేడుక‌ల్లో యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, మంచు మోహ‌న్‌బాబుస‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యులు మంచు విష్ణు, ల‌క్ష్మీ మంచు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ ఫొటోలు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ 20వ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. బిల్లా, రెబ‌ల్‌ సినిమాల‌ త‌ర్వాత కృష్ణంరాజు, ప్ర‌భాస్ క‌లిసి న‌టిస్తోన్న చిత్ర‌మిది. ఈ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com