తన ఇన్‌స్టాగ్రామ్‌లో 20 ఏళ్ల ఛాలెంజ్ పేరిట ఓ ఫొటోను షేర్ చేసింది బాలీవుడ్ నటి కాజోల్. 20 ఏళ్ల క్రితం నాటి ఫొటోతో పాటు తన తాజా ఫోటోని గ్రాఫిక్స్ ఇంటర్ చేంజ్ ఫార్మాట్లో ఇన్‌స్టాలో షేర్ చేసింది ఈ 45 ఏళ్ల నటి. షేర్ చేసిన ఈ పోస్టులో ఒకటి 1999 నాటిది అయితే మరొకటి గతేడాదికి చెందినది. ఒకే రకం స్టైల్లో పోజ్‌లో ఉన్న ఈ ఫొటోలకు.. “మిమ్మల్ని ఆశ్చర్యపరిచే విషయమే మీ గొప్ప ఆస్తి’ అనే క్యాప్షన్‌ను కాజోల్ యాడ్ చేసింది. ఆమె పోస్టుకు ఫిదా అయిన అభిమానులు.. ‘అప్పుడు, ఇప్పుడు ఒకేలా ఉన్నారు.. మీ అందం ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరలేదని కామెంట్స్ చేశారు.