ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సినిమా కోసమే కష్టపడుతున్న ఆది పినిశెట్టి!

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2020, 12:28 PM



నటుడు ఆది పినిశెట్టి భిన్నమైన కథాంశాలతో సినిమాలు చేయడానికి ఇష్టపడుతాడు. ప్రస్తుతం ఆది ఒక స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నారు. ఇందులో ఆది ఒక అథ్లెట్, కోచ్ పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు ‘క్లాప్’ అనే డిఫరెంట్ టైటిల్ నిర్ణయించారు. ఈ పాత్ర కోసం ఆది చాలానే కష్టపడుతున్నారు. ఎంతలా అంటే గతంలో తన ‘మృగం, ఏకవీర’ సినిమాల్లో పాత్రల కోసం కష్టపడినట్లుగా ఈ సినిమాలో పాత్ర కోసం పనిచేస్తున్నానని అంటున్నారు ఆది. ఇందులో ఆది సరసన ఆకాంక్ష సింగ్ కథానాయకిగా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. బిగ్ ప్రింట్ పిక్చర్స్, పిఎంఎం ఫిలిమ్స్, కట్స్ అండ్ గ్లోరీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com