ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కపిల్ దేవ్ బయోపిక్ '83' ను రిలీజ్ చేయనున్న నాగార్జున !

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 24, 2020, 12:41 PM



కపిల్ దేవ్ బయోపిక్ '83' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు 1983లో వెస్ట్ ఇండీస్ పై ఫైనల్ లో విజయం సాధించి వరల్డ్ కప్ ను ఎలా చేజిక్కించుకున్నారు ? అలాగే కపిల్ జీవితంలో చోటు చేసుకున్న ఆసక్తికరమైన విషయాలు ఏమిటి ? వంటి అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అన్నట్టు ఈ చిత్రంలో కపిల్ భార్య పాత్రలో దీపికా పదుకొనె నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ బయోపిక్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ బయోపిక్ చిత్రాన్ని విష్ణు ఇందూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 10న విడుదల చేయనున్నారు. అయితే ఈ సినిమాని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని చిత్రబృందం ఈ రోజు అధికారికంగా ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com